శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదు.. ఆయన నాలుకను: భూమన

సీఎం చంద్రబాబు నాయుడుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..

Update: 2024-09-23 12:43 GMT

దిశ, వెబ్ డెస్క్: తమ హయాంలో తిరుమల(Tirumala)లో ఎలాంటి తప్పులు జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Ttd Former Chairman Bhumana Karunakar Reddy) శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద ప్రమాదం చేశారు. అనంతరం ఆయన తిరుపతి(Tirupati)లో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శుద్ధి చేయాల్సింది శ్రీవారి ఆలయాన్ని కాదని, చంద్రబాబు నాలుకనని ఎద్దేవా చేశారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని, అది చాలా పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. ‘‘నేను, సుబ్బారెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు. అలా చేసి ఉంటే సర్వనాశనం అయిపోతాం. ఆరోపణలను అంగీకరించం. తప్పు చేయలేదు, చేయం. లడ్డూ కల్తీపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రభుత్వం కనుసన్నల్లో ఉండే సిట్, సీబీఐతో వద్దు. సీఎం చంద్రబాబు(Cm Chandrababu) చెప్పినట్లే టీటీడీ ఈవో శ్యామలారావు(TTD Eo Shyamala Rao) వ్యవహరిస్తున్నారు.’’ అని భూమన ఆరోపించారు. 


Similar News