‘ఇండస్ట్రీ పిచ్చుక లాంటిదే.. కానీ చిరంజీవి పిచ్చుక కాదు’
వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: వాల్తేరు వీరయ్య సినిమా 200 డేస్ ఫంక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. చిరంజీవి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చిరంజీవి చెప్పినట్లు తెలుగు చిత్ర పరిశ్రమ పిచ్చుక లాంటిదే అని.. కానీ, చిరంజీవి మాత్రం పిచ్చుకలాంటివారు కాదని వైసీపీ శ్రేణులకు సూచించారు. విజభన సమయంలో రాష్ట్ర హక్కుల కోసం చిరంజీవి ఒక్కరే గట్టిగా మాట్లాడారని గుర్తుచేశారు.
చిరంజీవి ఒక్కరే 18 సీట్లు సాధించారని, ఆ విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కాగా, రాష్ట్రంలో అసలు సమస్యలు వదిలేసి సినిమా పరిశ్రమపై పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వంలోని కొందరు పిచ్చుక మీద బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై పడడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారికి కడుపు నింపే విషయం గురించి ఆలోచించాలని సూచించారు. ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టిని సారించాలని, పేదలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలందిస్తే అందరూ తలవంచి నమస్కరిస్తారని చిరంజీవి పేర్కొన్నారు.