Ap News: జగన్ పొగరు నాశనానికే.. మాజీ ఎంపీ శాపనార్థాలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీకి దత్తపుత్రుడు అని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు..

Update: 2023-03-25 15:28 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్రమోదీకి దత్తపుత్రుడని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. అందుకే ప్రతీ శుక్రవారం కోర్టకు హాజరయ్యే జగన్‌ను వెళ్లకుండా చేయగలిగారని చెప్పారు. దీంతో సీఎం జగన్ గర్వంతో విర్రవీగిపోతున్నారని మండిపడ్డారు. జగన్ పొగరు నాశనానికి నడిపిస్తోందని వ్యాఖ్యానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్‌కు తగిన గుణపాఠం జరిగిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల కోటాలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచేదని హర్షకుమార్ వ్యాఖ్యానించారు. వైసీపీ ఓటమికి ప్రధాన కారణం వైఎస్ జగన్ అని ఆరోపించారు. దళితులను హత్య చేసిన నిందితులను ఎక్కడా అరెస్ట్ చేయడం లేదని, కల్తీరకం మద్యం అమ్ముతుండటంతో అంతా వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారని హర్షకుమార్ చెప్పారు.

మరోవైపు ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న నేతలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాయని హర్షకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం న్యాయ స్థానాన్నే చేతుల్లోకి తీసుకుందంటూ ధ్వజమెత్తారు. రాహుల్‌ గాంధీని లోక్‌సభ నుంచి సస్పెన్షన్ చేయటం దుర్మార్గమని హర్షకుమార్ మండిపడ్డారు.

Tags:    

Similar News