పవన్ దృష్టికి తీసుకెళ్తా.. ఎమ్మెల్యే దామచర్ల వ్యాఖ్యలపై బాలినేని రియాక్షన్

ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ ఇస్యూను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు...

Update: 2024-09-22 13:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ (Ongole Mla Damacharla Janardhan) ఇస్యూను జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) దృష్టికి తీసుకెళ్తానని ఆ నియోజకవర్గం మాజీ  మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి(Former Minister SrinivasaReddy) అన్నారు. బాలినేని శ్రీనివాసులు జనసేనలో చేరుతున్న నేపథ్యంలో ఏ పార్టీలో చేరినా అవినీతిపై తప్పించుకోలేవంటూ దామచర్ల జనార్థన్ చేసిన వ్యాఖ్యాలపై బాలినేని శ్రీనివాసులుపై స్పందించారు. తనపై దామచర్ల చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎప్పుడో సీఎం చంద్రబాబు (Cm Chandrababu)కు లేఖ రాశానని తెలిపారు. అవసరమైతే తనపై విచారణ చేసుకోవాలని కూడా చెప్పానని బాలినేని పేర్కొన్నారు. జనసేన ఫ్లెక్సీల్లో దామచర్ల ఫొటో వద్దనుకుంటే అది ఆయన ఇష్టమని, తాను మాత్రం వెనక్కి తగ్గనని బాలినేని వ్యాఖ్యానించారు. 

కాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ నెల 26న జనసేనలో చేరబోతున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌లో పని చేసిన ఆయన..  రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత రెండు సార్లు ఒంగోలు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి కావడం, జగన్ తీరు నచ్చకపోవడంతో బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. దీంతో ఒంగోలు కూటమి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో తమపై బాలినేని అక్రమంగా కేసులు పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు బాలినేని అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. జనసేనలో చేరినంత మాత్రానా బాలినేని అవినీతిని వదిలేయాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలినేని స్పందించారు. 


Similar News