Tirumala Laddu : మాజీ మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు

సీఎం చంద్రబాబు నాయుడు స్వలాభం కోసమే తిరుపతి లడ్డూపై నిందవేశారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు...

Update: 2024-09-30 10:58 GMT

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు నాయుడు (Cm Chandrababu) స్వలాభం కోసమే తిరుపతి లడ్డూ (Tirumala Laddu)పై నిందవేశారని మాజీ మంత్రి రోజా (Former Minister Roja) ఆరోపించారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు (Supreme Court) విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. శ్రీవారి భక్తుల మనోభావాలను ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు దెబ్బ తీశారని రోజా మండిపడ్డారు. చంద్రబాబు అండ్ కో చేసిన అబద్ధాలు కచ్చితంగా బయటకు వస్తాయన్నారు. సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా.. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా జగన్ టార్గెట్‌గా లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. లడ్డూ వివాదంపై వైవీ సుబ్బారెడ్డి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ తేదీని చెప్పే వరకూ చంద్రబాబు సిట్ వేయలేదని రోజా అన్నారు. సుప్రీంకోర్టు ద్వారా ఉన్నత స్థాయి విచారణ జరిగితే చంద్రబాబు చెప్పిన అబద్ధం బయటపడుతుందన్న భయంతో హడావుడిగా సిట్‌ను ఏర్పాటు చేశారని మంత్రి రోజా తెలిపారు.

‘‘తొలి నుంచి సిట్‌పై మాకు నమ్మకం లేదు. చంద్రబాబు చెప్పినట్టే సిట్ నివేదిక వస్తుంది. సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ ద్వారా విచారణ జరిపితే కచ్చితంగా హిందువుల మనోభావాలను గౌరవించిన, పునరుద్ధరించిన వాళ్లమవుతాం. చంద్రబాబు నాయుడు వేసిన ఈ నిందతో నెయ్యిలో జంతువుల అవశేషాలు కలిశాయా లేదా అనే అనుమానాలతో భక్తులు తిరుమల లడ్డూ తినకుండా వెళ్లిపోతున్నారు. తిరుపతి అమ్మాయిగా చాలా బాధ కలుగుతోంది.’’ అని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News