Anil Kumar Yadav: ‘మగాడివైతే నాపై పోటీ చేయ్.. ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా’
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శల దాడి పెంచారు. గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మూడు రోజులుగా ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శల దాడి పెంచారు. గత కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ మూడు రోజులుగా ప్రెస్మీట్లు పెట్టి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలపై నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా సోమవారం సైతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై విరుచుకుపడ్డారు. నారా లోకేశ్ మగాడైతే నెల్లూరు సిటీ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినప్పటికీ తాను రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొంద3ానని కానీ తాత, తండ్రిలు ముఖ్యమంత్రులుగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లోకేశ్ మాత్రం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో లోకేశ్ తన గెలుపును ఆపగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ విసిరారు.
ఒకవేళ నెల్లూరు సిటీ నుంచి లోకేశ్ పోటీ చేసి ఓటమిపాలైతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని నిలదీశారు. మరోవైపు నెల్లూరు సిటీ నుంచి తనను ఓడించేందుకు ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తనను ఓడించేందుకు టీడీపీ ఏకంగా రూ. 200 కోట్లు సిద్ధం చేసిందని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద మెప్పుపొందేందుకే తాను వరుస ప్రెస్‌మీట్లు పెట్టి విమర్శల దాడి చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. వైఎస్ జగన్ వద్ద తాను ప్రత్యేకంగా మెప్పు పొందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. మరోవైపు ఆనం రామనారాయణరెడ్డిపైనా విరుచుకుపడ్డారు. ఆనం రామనారాయణరెడ్డి ద్రోహి అని మండిపడ్డారు. 80 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన ఆనం కుటుంబ గౌరవాన్ని లోకేశ్ కాళ్ల ముందు రామనారాయణరెడ్డి తాకట్టుపెట్టారని విమర్శించారు. ఒక్కసారి కూడా గెలవని లోకేశ్ కోసం ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆనం రామనారాయణరెడ్డి పాకులాడటం చూస్తుంటే విడ్డూరంగా ఉందని మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి : Chandrababu: రాష్ట్రమా...రావణ కాష్ఠమా ?.. రెండు నిమిషాల వీడియాతో తీవ్ర ఆగ్రహం