AP:ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం..మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తెలిసిందే.

Update: 2024-08-22 09:17 GMT

దిశ,వెబ్‌డెస్క్:అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అడుగుపెట్టగానే ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ స్పందించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మాట్లాడుతూ..ఒక మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో లేవని విమర్శించారు. తాడిపత్రిలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఎస్పీకి సమాచారం ఇచ్చి వెళ్లిన టీడీపీ మూకలు అడ్డుకున్నాయని జగన్ ఆరోపించారు. తాడిపత్రిలో వైసీపీ నాయకుడి ఇంటిని తగలబెట్టారని, వాహనాలు ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే నేరం చేయాలంటేనే భయపడాలంటూ చంద్రబాబు కబుర్లు చెబుతున్నారు. ఇంతకన్నా దారుణం ఏముంటుందని వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Tags:    

Similar News