AP News:రూట్ మార్చిన మాజీ సీఎం జగన్..రేపటి నుంచి ప్రజా దర్బార్..?
ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కాగా, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కాగా, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. దీంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రజలతో మమేకమయ్యెందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశమైన వైఎస్ జగన్ పార్టీ ఓటమి సంబంధించిన నేతలకు భరోసాను కల్పించే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో రేపటి నుంచి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం జోరుగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చే పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడడంతో పాటు వారి నుంచి వినతులను స్వీకరించనున్నారు. ఈ విధంగా మాజీ సీఎం జగన్ అధికారంలో లేకున్నా ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి, ప్రజల కష్టాలు తీర్చబోతున్నారని పలువురు పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.