తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చు: బాబు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో భయంకరమైన వాతావరణం నెలకొందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో భయంకరమైన వాతావరణం నెలకొందని మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం అమరావతిలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఏపీలో నేరస్తుల పాలన జరుగుతోందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏడు సార్లు కరెంట్ చార్జీలు పెంచారని.. రాష్ట్రంలో భూముల విలువ భారీగా పడిపోయిందన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఒక్క ఎకరం అమ్మితే.. ఏపీలో 50 నుంచి 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో భయంకరమైన వాతావరణ నెలకొందని.. స్వేచ్ఛగా మాట్లాడితే తప్పుడు కేసులు, ఆస్తుల జప్తు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం మందుతో పేదవారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. మనస్సాక్షి లేని వ్యక్తి సీఎం జగన్ అని విమర్శించారు. గుడివాడలో నాలుగేళ్ల తర్వాత టిడ్కో ఇళ్లను పంపిణీ చేశారని.. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డగా చెప్పుకునే వ్యక్తి సీఎం జగన్ అని ఫైర్ అయ్యారు.