జగన్‌కు మరో బిగ్ షాక్.. ఆ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది..

Update: 2024-12-12 04:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former AP CM Jagan Mohan Reddy)కి మరో బిగ్ షాక్ తగిలింది. సరస్వతి పవర్ అసైన్డ్ భూముల(Saraswati Power Assigned Lands)పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాచవరం మండలంలోని 17. 69 ఎకరాల అసైన్డ్ భూముల(Assigned lands)ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది.


కాగా వైఎస్ జగన్(Ys Jagan), ఆయన సోదరి షర్మిల(Ys Sharmila, తల్లి విజయమ్మ(Ys Vijayamma) ఆస్తుల వివాదం కోర్టుకు చేరడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Ap Deputy Cm Pawan Kalyan) ఆదేశాలతో ఇటీవల కాలంలో మాచవరానికి చెందిన `సరస్వతి పవర్ అసైన్డ్ భూముల(Saraswati Power Assigned Lands)ను పరిశీలించారు. ఈ సంస్థకు కేటాయించిన భూముల్లో అసైన్డ్ భూములు ఉన్నాయా, లేదా అనేది తేల్చాలని పవన్ కల్యాణ్ ఆదేశించారు. దీంతో ఆర్ఎస్ఆర్, ఎఫ్ఎంబీ రికార్డులను రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. మాచవరం మండలం ఎమ్మార్వో క్షమారాణి, సర్వేయర్ సాల్మన్ రాజు, ఆర్ఐ కోటేశ్వరరావు, వీఆర్వో అఖిల్, దాచేపల్లి అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి కె. విజలక్ష్మి, బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మనోజ్ సరస్వతి సిమెంట్స్, పవర్ భూములను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములను వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News