నీటి కోసం: మెడపై కొడవలి పెట్టుకుని రైతులు నిరసన

సాగునీటి కోసం రైతులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.

Update: 2023-10-15 08:45 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : సాగునీటి కోసం రైతులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.‘పొలాలు ఎండిపోతున్నాయి..తక్షణమే సాగునీరు విడుదల చేయండి అని కోరుతూ ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ లో నందివెలుగు జంక్షన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు.తాము సాగు చేస్తున్న పంటకు సాగునీరు లేక ఎండిపోయిందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా రైతులు తమ మెడపై కొడవలి పెట్టుకుని నిరసన గళం వినిపించారు. రైతులు చేస్తున్న నిరసనకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు, మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తోపాటు పలువురు టీడీపీ శ్రేణులు, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. రైతుల ఆందోళనతో విజయవాడ తెనాలి, కొల్లిపర గుంటూరు మార్గాలలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. కృష్ణ పశ్చిమ డెల్టా ప్రాంతాలకుకు సాగునీరు విడుదల చేయాలని ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఇరిగేషన్ అధికారులు ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. సాగునీటి ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. 

Tags:    

Similar News