Food Poisoning:గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్..30 మంది విద్యార్థినులకు అస్వస్థత

కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థినీలు అస్వస్థత కు గురయ్యారు.

Update: 2024-08-27 07:42 GMT

దిశ ప్రతినిధి,కాకినాడ:కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో 30 మంది విద్యార్థినీలు అస్వస్థత కు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పరామర్శించారు. సంఘటన వివరాలు తెలుసుకున్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఏలేశ్వరం ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు.ఫుడ్ పాయిజన్ సంఘటన పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన నన్ను ఆందోళనకు గురి చేసింది. వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విద్య, వైద్య శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని, విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.


Similar News