నిన్ననే అట్టహాసంగా ప్రారంభం.. నేడు తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి..

ఆంధ్ర రాజధానిగా వైజాగ్‌ను మార్చేందుకు సిద్ధం అయిన జగన్ ప్రభుత్వం.. ఇక్కడ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది.

Update: 2024-02-26 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్ర రాజధానిగా వైజాగ్‌ను మార్చేందుకు సిద్ధం అయిన జగన్ ప్రభుత్వం.. ఇక్కడ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఆర్కే బీచ్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించింది. ఈ క్రమంలోనే.. ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్రజలకు మంత్రి ఉత్సహాన్ని ఇచ్చేందుకు గాను సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు ఫ్లోటింగ్ బ్రిడ్జి ని ఏర్పాటు చేశారు. దీనిని ఆ రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి శనివారం అట్టహాసంగా ప్రారంభించారు.

కానీ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఒక్కరోజు ముచ్చటగానే మిగిలిపోయింది. అలల తాకిడిని ప్రజలు ఆస్వాదించే ఉద్దేశంతో ప్రారంభింగా నిన్న రాత్రి భారీగా వచ్చిన అలల కారణంగా ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే ఇలా తెగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. రాత్రి ఈ ఘటన జరగడంతో ఎటువంటి అపాయం జరగలేదని.. ఒక వేళ దానిపై ఎవరైనా ఉన్న సమయంలో అలా జరిగితే ప్రాణ నష్టం జరిగిదేని ప్రజలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ కోసం ఇలానే చేస్తుందని.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఏదో చేసినట్లు పోస్టర్లు కట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తోందని సోషల్ మీడియా వేదికగా వైసీపీని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

Read More..

ఒక్కరోజుకే తెగిపొయిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్.. వద్దని చెప్పినా వినని అధికారులు

Tags:    

Similar News