Srisailam Reservoir:శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేట నిషేధం
శ్రీశైలం జలశాయానికి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో సోమవారం సాయంత్రం జలాశయం అధికారులు రేడియల్ క్రేస్టు గేట్లు మొత్తం మూసివేశారు.
దిశ,వెబ్‌డెస్క్:శ్రీశైలం జలశాయానికి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో సోమవారం సాయంత్రం జలాశయం అధికారులు రేడియల్ క్రేస్టు గేట్లు మొత్తం మూసివేశారు. ఈ క్రమంలో ఒక్కసారిగా జలాశయం గేట్లు మూసివేయడంతో మత్స్యకారులు చేపల వేటకు జలాశయం పరిసరాల్లోకి వెళ్లారు. సుమారు 13, 14 రోజుల నుంచి జలాశయం గెట్లు ఎత్తడంతో మత్స్యకారులను అటువైపు వెళ్లొద్దని జలాశయం అధికారులు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గేట్లు మూసేశారని తెలుపడంతో మత్స్యకారుల ఆనందంతో 100ల సంఖ్యల వలలతో జలాశయం వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో మరోసారి మత్స్యకారులకు షాక్ తగిలింది. శ్రీశైలం జలాశయం పరిసరాల్లో చేపల వేటపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జులై, ఆగస్టులో చేపల సహజ సంతానోత్పత్తి కాలం అని, ఆ సమయంలో జలాశయం బ్యాక్ వాటర్స్‌లో వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. కాగా రెండు రోజుల క్రితం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల ఆగిపోవడంతో మత్స్యకారులు చేపల వేటకు దిగారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.