Breaking: పోసానికి ఉపశమనం
సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళికి ఉపశమనం లభించింది..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu), డిప్యూటీ సీఎం పవన్(Deputy Cm Pawan), మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali)కి ఉపశమనం లభించింది. తమ అధినేతలను కించపర్చారని ఆదోని పోలీస్ స్టేషన్(Adoni Police Station)లో పోసానిపై పలువురు టీడీపీ(Tdp), జనసేన(Janasena)నేతలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఆదోని కోర్టు.. పోసానికి బెయిల్ మంజూరు చేసింది. పోలీసులు, పోసాని తరపు వాదనలు విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. కాగా నరసరావుపేటతో పాటు రాజంపేటలో నమోదు అయిన కేసుల్లోనూ ఆయనకు ఊరట లభించింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో నమోదైన కేసుల్లో పోసానికి కోర్టు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కర్నూలు జైలులో ఉన్నారు. విజయవాడ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోసాని బుధవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు లాయర్లు చెబుతున్నారు.