ఘోర రోడ్డు ప్రమాదం : ఎమ్మెల్సీ షేక్ షాబ్జీ దుర్మరణం

ఏలూరు జిల్లా ఉండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2023-12-15 07:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏలూరు జిల్లా ఉండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జీ రోడ్డు దుర్మరణం చెందారు. ఉండి మండలం చెరుకువాడ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో షేక్ షాబ్జీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వ్యక్తిగత సిబ్బంది, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు వదిలారు. ఇకపోతే షేక్ షాబ్జీ అంగన్వాడీల సమ్మెలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే మార్గమధ్యలో ప్రమాదం బారినపడి మృతి చెందారు. ఇకపోతే షేక్ షాబ్జీ 2021లో ఉపాధ్యాయుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News