కావలిలో కోటీశ్వరులైన రైతులు.. ఎలాగంటే..!

కావలి ట్రంకు రోడ్డు ప్రక్కన ఉన్న రైతులు కోటీశ్వరులయ్యారని వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు....

Update: 2024-04-27 13:22 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి. దీంతో అభ్యర్థులందరూ గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకే ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘చాలా బలమైనది వాలంటీర్ల వ్యవస్థ. ప్రజలకు మంచి చేసేందుకు తీసుకున్న మంచి నిర్ణయం.పేదరికాన్ని నిర్మూలించేందుకు సంక్షేమ పథకాలు పెట్టారు. పేదలు సంతోషంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మాణం అవుతోంది. ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు అవుతారు. తీర ప్రాంత అభివృద్ధికి నాలుగు పోర్టులు నిర్మించడం జరుగుతోంది. రామయంపట్నం పోర్టు వల్ల 7 వేల రకాల ఇండస్ట్రీలు రాబోతున్నాయి. వీటి వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. చుట్టు ప్రాంత గ్రామాల్లో ఉపాధి కల్పన దొరుకుతుంది. ఇండస్ట్రీస్ వల్ల భూముల విలువలు కూడా పెరుగుతున్నాయి. కావలి పరిసరాల్లో ఎకరా భూమి రూ. 40 లక్షల నుంచి కోటి వరకూ ఉంది. తద్వారా రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఇదంతా సీఎం జగన్ మోహన్ రెడ్డి వల్లే జరిగింది. కావలి ట్రంకు రోడ్డు నిర్మాణంలో ఉండగానే గతంలో రూ. 5 వేలు ఉన్న అంకం భూములు ఇప్పుడు రూ. 5 లక్షలకు పెరిగింది. దీని వల్ల కావలి ట్రంకు రోడ్డు ప్రక్కన ఉన్న రైతులు, ప్రజలు కోటీశ్వరులు అయ్యారు.’ అని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు.


Similar News