చంద్రబాబు రిమాండ్ పొడిగించండి: ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.

Update: 2023-10-19 06:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు నాయుడు రిమాండ్‌ను పొడిగించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. ఈనెల 12 నుంచి డీహైడ్రేషన్, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు చంద్రబాబును వర్చువల్‌గా ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సెప్టెంబర్ నెలలో సీఐడీ అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సంగతి తెలిసిందే. దీంతో విజయవాడ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు 41 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. 

Tags:    

Similar News