ఉత్కంఠ: నేడు సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మధ్యాహ్నాం 2గంటలకు విచారణ జరగనుంది.
దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై మధ్యాహ్నాం 2గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడి ధర్మాసనం ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది. ఇప్పటికే ఈ కేసులో అటు చంద్రబాబు ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తున్నారు. అయితే నేడు సుప్రీంకోర్టులో తుది వాదనలు వినిపించనున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్ మెంట్ కేసును కొట్టివేయాలంటూ సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకు 17ఏ వర్తిస్తుందని ఆయన తరపు న్యాయవాదులు హరీశ్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. అయితే 17ఏ వర్తించదని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు. మంగళవారం సాయంత్రం లోపు ఇరు పక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించనుందా? లేకపోతే రిజర్వ్ చేయనుందా అనేది సస్పెన్ష్‌గా మారింది.