Breaking:వైసీపీకి బిగ్ షాక్..పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.

Update: 2024-07-22 10:39 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈ క్రమంలో పార్టీ నేతల్లో అసహనం నెలకొంది. ఈ నేపథ్యంలో గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, గుంటూరు నగర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి రాజీనామా చేశారు. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కాగా 2019లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ముద్దాలి గిరి ఆ తర్వాత వైసీపీలో చేరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన వైసీపీ పట్ల విముఖతతో ఉన్నారనే వార్తలు వినిపించాయి.

Tags:    

Similar News