AP News:‘అక్రమ అరెస్టులపై న్యాయపోరాటం చేస్తాం’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
దిశ,వెబ్డెస్క్: రాష్ట్రంలో టీడీపీ(TDP), వైసీపీ నేతల(YCP Leaders) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Former minister Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై వ్యతిరేకంగా పెడుతున్న అసభ్యకర, వ్యంగ్య పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల విషయంలో విఫలమైందని ఆరోపించారు.
ఈ క్రమంలో వైసీపీ సోషల్ మీడియా(Social Media) కార్యకర్తలను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా వైసీపీ కార్యకర్త తప్పుడు పోస్టులు పెడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు చట్టం ప్రకారం వ్యవహరించాలి అని ఆయన సూచించారు. తాము ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. సంతకం పెట్టి కూడా కొట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.