AP:వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు.

Update: 2024-09-03 11:56 GMT

దిశ ప్రతినిధి,తిరుపతి:విజయవాడలో ప్రజల కష్టాలను చూసి గుండె తరుక్కుపోతుంది చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వరదల్లో చిక్కుకుపోయి అవస్థలు పడుతున్నారు. కనీసం పసిబిడ్డలకు పాలు కూడా అందలేదు. ప్రజలు ఇన్ని కష్టాలు పడటానికి, ఇంత మంది ప్రాణాలు పోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కారణం అని మాజీ మంత్రి రోజా ధ్వజమెత్తారు. మంత్రులు విహార యాత్రలకు వెళ్లి ప్రజలను వరదల్లో ముంచేశారు. ఇదేదో నేను విమర్శించడానికి చెప్తున్న మాట కాదు మనం ఏ టీవీ చూసినా, తెలుగుదేశం పార్టీ చానళ్లు చూసినా ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో తెలుస్తుందన్నారు.

విజయవాడ మునిగిపోతుంటే ఈ ప్రభుత్వం ఐదురోజులైన కనీసం ఆహారం కూడా అందించడంలో విఫలం కావడం దారుణమని మండిపడ్డారు. వరద సహాయ చర్యల్లో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. చంద్రబాబు ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇంత పెద్ద విపత్తు వచ్చినా కనీసం ప్రజలను ఆదుకోలేక పోయారంటే...ఇది ముమ్మాటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యం అని ఆరోపించారు. రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదని వీకెండ్స్ విహారయాత్రలకు మంత్రులు ప్లాన్ చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 10 మంది చనిపోయారని వేల మంది నిరాశ్రయులయ్యారు అని ధ్వజమెత్తారు.


Similar News