YS Jagan:‘అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి’.. ప్రభుత్వం పై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మాజీ సీఎం జగన్(YS Jagan) నేడు(బుధవారం) తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు.

Update: 2024-12-04 10:19 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మాజీ సీఎం జగన్(YS Jagan) నేడు(బుధవారం) తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం పై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో భాగంగా కూటమి ప్రభుత్వం పై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో జగన్ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం(AP Government) పై 6 నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ అన్నారు. ‘సూపర్ 6 అమలు పై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్(Reimbursement of Fees), వసతి దీవెన, ఆరోగ్య శ్రీ బకాయిలు, 104, 108 సిబ్బందికి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కరెంటు చార్జీలు పెంచారు. ప్రజల పై మరింత భారం మోపేందుకు సిద్ధమయ్యారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు’ అని ఆరోపించారు.

Tags:    

Similar News