AP News:గర్ల్స్ హాస్టల్‌లో ఎలాంటి పరికరాలు లభించలేదు:సీఎం చంద్రబాబు

కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ కాలేజ్ హస్టల్ వాష్‌ రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

Update: 2024-08-31 08:54 GMT

దిశ,వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఇంజినీరింగ్ కాలేజ్ హస్టల్ వాష్‌ రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయంటూ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళన పై సమగ్ర విచారణ జరపాలని పోలీసులను, ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఈక్రమంలో గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై సీఎం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. సకాలంలో స్పందించి అధికారులను అప్రమత్తం చేశామని, హాస్టల్ మొత్తం తనిఖీ చేసినా ఇప్పటివరకు ఎలాంటి పరికరాలు దొరకలేదని చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా సమగ్ర విచారణ కొనసాగుతుందన్నారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.


Similar News