అటు క్రికెటర్స్.. ఇటు ఉద్యోగులు.. విశాఖలో ఉద్రిక్తత

సీఎం జగన్ హామీలు నెరవేర్చాలని విశాఖలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు...

Update: 2024-02-05 14:15 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్ జగన్ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నిన్న మొన్నటి వరకూ అంగన్ వాడీ కార్యకర్తలు అందోళనకు దిగిని విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. విశాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవర్చాలంటూ సాగర సంగ్రామ దీక్ష చేపట్టారు. సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎన్నికల్లో వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయడం చేతకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని మంత్రి బొత్స సత్యనారాయణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హామీ ఇచ్చింది ఓపీఎస్ అని.. తమల్ని ముంచింది జీపీఎస్ అని ఆరోపించారు. అబద్ధాలతో మోసం చేసిన సీఎం జగన్‌ను ప్రజాకోర్టులో శిక్ష ఖాయమని హెచ్చరించారు. ఇక ఎక్కువ రోజులు సాకులు చెప్పి తప్పించుకోలేరని,ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా నిలిచిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు నిరుద్యోగులు సైతం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దగా డీఎస్సీ వద్దని అని, మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ 33 వేల డీఎస్సీ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

అటు విశాఖలో ఇంగ్లండ్.. భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. క్రికెటర్లు స్టేడియంలో సిక్కులు, ఫోర్లు కొడుతుంటే.. ఇటు సీఎం జగన్‌పై  ఉద్యోగులు, నిరుద్యోగులు విమర్శల పంచ్‌‌లు విసురుతున్నారు. దీంతో విశాఖలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 


Similar News