రూ.14 కోట్ల విరాళం అందించిన పవన్ కల్యాణ్ మంత్రిత్వ శాఖ ఉద్యోగులు

గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదలతో జన జీవనం స్తంభించిపోయింది.

Update: 2024-09-04 16:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదలతో జన జీవనం స్తంభించిపోయింది. ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబ్ జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలు నీటమునిగాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40 మందికి పైనే చనిపోయారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు అండగా ఉండేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు, ఉద్యోగులు విరాళాలు అందిస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇప్పటికే భారీ మొత్తంలో రూ.6 కోట్ల విరాళం ప్రకటించారు. పవన్ కల్యాణ్ స్ఫూర్తితో ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు రూ.14 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో వారిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.


Similar News