ట్రాఫిక్ చలాన్ కట్టకపోతే విద్యుత్, నీళ్లు కట్. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు..
ఆంధ్రప్రదేశ్ లో హెల్మెట్ ధరించకపోవడం వలన 667 మంది మృత్యువాత పడ్డారని హైకోర్టులో (High Court) దాఖలైన పిటిషన్‌పైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Thakur) ధర్మాసనం విచారణ చేపట్టింది.
దిశ, వెబ్ డెస్క్; ఆంధ్రప్రదేశ్ లో హెల్మెట్ ధరించకపోవడం వలన 667 మంది మృత్యువాత పడ్డారని హైకోర్టులో (High Court) దాఖలైన పిటిషన్‌పైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Thakur) ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రాఫిక్ (Traffic) నియమాలను సరిగా పాటించకుండా ఉన్నందుకే గత మూడు నెలల్లో 667 చనిపోయారని వెల్లడించింది. పోలీసులు తమ విధులు సరిగా నిర్వర్తించకపోవడం వలనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు అవుతున్నాయని ఆరోపించింది. అధికారుల నిర్లక్ష్య ధోరణికి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవి ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాల డ్రైవర్లు ఎవరూ సీటు బెల్టులు పెట్టుకోవడం లేదని, తెలంగాణ సరిహద్దుకు వెళ్ళగానే సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నారని అక్కడ చట్టనిబంధలు కఠినంగా అమలు చేస్తారని తెలిపింది. ట్రాఫిక్ చలాన్ కట్టని వాహనదారుల ఇళ్లకు విద్యుత్, నీళ్ల సరఫరా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది.