AP Elections 2024: పోల"వార్"లో విజేత ఎవరు..?
శనివారం పోలవరం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చిర్రి బాలరాజునుజనసేన అధిష్టానం ప్రకటించింది.
దిశ, కుక్కునూరు: శనివారం పోలవరం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా చిర్రి బాలరాజునుజనసేన అధిష్టానం ప్రకటించింది. దీనితో పోలవరం రాజకీయాలు హెట్టెక్కాయి. ఇప్పటికే తెల్లం రాజ్యలక్ష్మిని వైసీపీ తరుపున పోలవరం అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఇక రాజ్యలక్ష్మి కూడా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తీవ్రస్థాయిలో శ్రమించారు, ఎట్టకేలకు ప్రచారంలో విజయం సాధించారు.
ఎంతలా అంటే పోలవరంలో ఆమె తెలియని ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు అనేలా ఆమె పార్టీ ప్రచారం చేశారు. ఇక చిర్రి బాలరాజు కూడా క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వ్యాపారస్తులు, కార్మికులు, రైతులు, ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ రాజ్యలక్ష్మి కంటే ఎక్కువ మెజారిటీతో తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్ధిస్తున్నారు.
నియోజకవర్గానికి తమ గెలుపు ఆవశ్యకత, అవసరం ఎందుకో స్పష్టంగా, సూటిగా చెబుతూ రాజకీయ చాణక్యుడుగా బాలరాజు పేరు తెచ్చుకున్నారు. అయితే ఎవరు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా పోలవరంలో ఫ్యాన్ గాలి మాత్రం తగ్గడంలేదని.. రానున్న ఎన్నికల్లో కూడా పోలవరం వైసీపి పరమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.