భారీ వర్షాల ఎఫెక్ట్.. ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పోర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.

Update: 2024-09-08 10:26 GMT

దిశ, వెబ్ డెస్క్: గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పోర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల ప్రకారం మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో సోమవారం విజయనగరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ. కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విశాఖ, శ్రీకాకుళం, గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ జిల్లాలో కూడా రేపు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


Similar News