Duvvada Srinivas: మాధురి పుట్టింటికి, మెట్టినింటికి దూరమైంది: దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

మాధురి అటు పుట్టింటికి.. ఇటు మెట్టినింటికి దూరమైందని, ఆ డిప్రెషన్‌లో ఆమె వెళ్తున్నారో తెలియట్లేదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-12 04:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాధురి అటు పుట్టింటికి.. ఇటు మెట్టినింటికి దూరమైందని, ఆ డిప్రెషన్‌లో ఆమె వెళ్తున్నారో తెలియట్లేదని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలోను మాధురి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు తానే కాపాడి ధైర్యం చెప్పానని అన్నారు. తన వ్యక్తిత్వ హననం జరగుతోందంటూ మాధురి పలుమార్లు తనతో చెప్పుకుని బాధ పడిందని తెలిపారు. డిప్రెషన్ మూడ్ వల్లే ఆ ప్రమాదం జరిగిందంటూ ఆమె చెప్పిందని పేర్కొన్నారు. యాక్సిడెంట్ ఏదో డ్రామా కాదని, ఒకవేళ డ్రామా చేయాలనుకుంటే అది నిజమైతే ఏం జరిగి ఉండేదని ప్రశ్నించారు. మాధురి తలకు తీవ్ర గాయం అయిందని, ఏడాదిలో ఏమైనా జరగొచ్చంటూ డాక్లర్లు చెప్పారని వివరించారు.

తాను ఎవరికీ భయపడే రకం కాదని, నిర్మొహమాటంగా మాట్లాడతానని అన్నారు. అందుకే బయట కూడా తనకు శత్రువులు పెరిగారని పేర్కొన్నారు. భార్యభర్తల నడుమ ఏ జరిగినా.. ఈ సమాజం భార్యవైపే మొగ్గు చూపుతుందని కామెంట్ చేశారు. తన భార్య తండ్రి రాఘవరావు ఎలాంటి వ్యసనపరుడో అందరికీ తెలుసని అన్నారు. తన జీవితంలో ప్రతిక్షణం భార్యతో నరకం చూశానని, పిల్లలను తనపైకి ఉరిగొల్పిన వాణిది సైకో మనస్తత్వమని తెలిపారు. మాధురిని చూసేందుకు తాను ఆసుపత్రికి వెళ్లాలని.. కానీ, బయటకు వెళితే.. నా ఇళ్లును కబ్జా చేస్తారని దువ్వాడ అన్నారు. రెండేళ్ల క్రితమే వాణికి డివోర్స్ నోటీసులు కూడా ఇచ్చానని తెలిపారు.  

Tags:    

Similar News