మాదిగలను మోసం చేస్తున్న జగన్‌ను నమ్మెుద్దు: మాజీమంత్రి కేఎస్ జవహర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిగ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాదిగ సామాజిక వర్గాన్ని దారుణంగా మోసం చేస్తున్నారని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. మాదిగ ఆత్మీయ సమ్మేళనం పేరుతో మరోసారి మాదిగలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీమంత్రి కేఎస్ జవహర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. వైసీపీలోని మాదిగ ప్రజాప్రతినిధులు వ్యక్తిగత ప్రయోజనం చూసుకుంటున్నారే తప్ప సొంత సామాజిక వర్గానికి చేసిందేమీ లేదన్నారు. పేరుకు మాదిగ కార్పోరేషన్‍ను ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ఇప్పటి వరకు ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం అన్యాయమన్నారు. అంతేకాదు లిడ్ క్యాప్ అడ్రస్ లేకుండా చేశారని మండిపడ్డారు. భూమి కొనుగోలు పథకం అటకెక్కించారని... ముందడుగు పథకం ఊసే లేదని ఎద్దేేవా చేశారు. వైఎస్ జగన్ నిర్లక్ష్యానికి రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ బలైందని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన డప్పు, చెప్పు, చర్మకార ఫించన్‍లు తప్ప మాదిగలకు వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. మాదిగలకు చంద్రబాబు పాలనలోనే మేలు జరిగిందని...వైఎస్ జగన్ పాలనలో మాదిగలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. బాబూ జగ్జీవన్ జ్యోతిని సైతం కొండకెక్కించారని విరుచుకుపడ్డారు. అంతేకాదు మలుపు పథకం మరిచిపోయారని... మాదిగలెప్పుడు ఇంత దయనీయ పరిస్థితి చూడలేదని చెప్పుకొచ్చారు. అసలు వైఎస్ జగన్ తన నాలుగున్నరేళ్ల పాలనలో మాదిగలకు ఏం చేశారో చెప్పాలని ఆ తర్వాతే సదస్సులు నిర్వహించాలని మాజీమంత్రి కేఎస్ జవహర్ డిమాండ్ చేశారు.