బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ ఒక్క నెల సంపాదన ఎంతో తెలుసా?

Update: 2024-04-22 14:23 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సంపాద విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతి నెల ఆయనకు, ఆయన భార్యకు రూ. 25 లక్షల సంపాదన ఉంది. ఈ విషయం స్వయంగా సీఎం రమేశ్ తెలిపారు. ఓ టీవీ ఛానల్ డిబేట్‌లో ఆయన మాట్లాడుతూ తనకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. వాటిపై రెంటర్ ఇన్ కమ్ వస్తుందని తెలిపారు. పార్లమెంట్ మెంబర్ గా జీతం వస్తుందన్నారు. హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ బాగా మాట్లాడతానని చెప్పారు. మోదీ, అమిత్ సాతో ఇంగ్లీష్, హిందీలో మాట్లాడతానన్నారు. టీడీపీలో తానూ, రేవంత్ కలిసి పని చేశామన్నారు. స్నేహం వేరని, రాజకీయం వేరని తెలిపారు. చాలా పార్టీల్లో తనకు స్నేహితులు ఉన్నారన్నారు. అనకాపల్లి ఎన్నికల్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని తెలిపారు. మళ్లీ దేశంలో ప్రధాన మోడీనే గెలుస్తున్నారని జోస్యం చెప్పారు. దేశంలో ఏ సీఎంతో అయినా ఈజీగా మాట్లాడగలనని, కానీ సీఎం జగన్‌తో మాత్రం మాట్లాడలేనని తెలిపారు. అసెంబ్లీ అభ్యర్థి స్థానికుడై ఉండాలని.. కానీ ఎంపీ అభ్యర్థికి పరిచయాలు, పలుకుబడి ఉండాలని సీఎం రమేశ్ పేర్కొన్నారు. 


Similar News