ఈవీఎం గోడౌన్లను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
స్ధానిక కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భధ్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ప్రసన్న,వెంకటేష్ సోమవారం తనిఖీ చేశారు.
దిశ, ఏలూరు:స్ధానిక కలెక్టరేట్ లో ఉన్న ఈవీఎం యంత్రాలు, వివిప్యాట్ భధ్రపరిచే గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ ప్రసన్న,వెంకటేష్ సోమవారం తనిఖీ చేశారు.గోడౌన్‌కు వేసిన సీళ్లను ఈవీఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.అనంతరం పర్యవేక్షణ రిజిష్టర్ లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఎప్పటి కప్పుడు ఈవీఎం, వీవీప్యాట్ గోదాంను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు తెలిపారు. EVM గోదాం వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ జరిగింది. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓడి పుష్ప మణి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సత్యనారాయణ (ఆప్), సాదే బాబు ప్రసాద్(కాంగ్రెస్), పిచ్చుక ఆదిశేషు(సీపీఎం) , అచ్యుత్ (టీడీపీ), కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Read More..