ఓటుకు నోటు తీసుకున్నారా? మా షాపులో వస్తువులు అమ్మబడవు, వ్యాపారి వినూత్న నిరసన (ఫొటో వైరల్)
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ క్రమంలోనే అక్కడక్కడ అల్లర్లు కూడా శృతి మించాయి. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ.. ప్రభుత్వాన్ని గద్దే దింపాలని టీడీపీ కూటమి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ఓటర్లకు డబ్బులు విపరీతంగా వెదజల్లారు. తాగినోడికి తాగినంత మద్యం సరఫరా చేస్తూ.. ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో ఓ షాపు యజమాని వినూత్న నిరసనకు తెరలేపాడు. ‘ఓటును అమ్ముకున్న.. ఓ ఓటరన్న.. ఓటు అమ్ముకున్న సొమ్ముకు మా షాపు నందు వస్తువులు అమ్మబడవు అంటూ బ్యానర్ ఏర్పాటు చేశాడు. కష్టపడి సంపాదించిన సొమ్ముతోనే తమ వద్ద వస్తువులు కొనాలని అందులో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన ఏర్పాటు చేసిన బ్యానర్ అటు సోషల్ మీడియాలోనే.. ఇటు గుడివాడ వ్యాప్తంగా తీర్చ చర్చనీయాంశమైంది.