Dhavaleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి పోటెత్తిన వరద నీరు.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి వదర ఉధృతి పెరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎగువన కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం బ్యారేజీకి గోదావరి వదర ఉధృతి పెరిగింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. బ్యారేజ్ వద్ద ప్రస్తుతం నీటిమట్టం 14.50 అడుగులుగా ఉంది. వరద నీరు పెద్ద ఎత్తున బ్యారేజీలోకి వస్తుండటంతో సుమారు 13,00,261 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో భద్రాచలం దిగువన ఉన్న కొత్తగా ఏపీలో విలీనం అయిన మండలాలతో పాటు కోనసీమ పరివాహక ప్రాంతంలోని కొన్ని లంక గ్రామాల ప్రజలు వరదల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. ఇక కనకాయలంక కాజ్ వేపై రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మరోవైపు వరదల్లో చిక్కుకున్న లంక గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేస్తూ.. సహాయక చర్యలను ముమ్మరం చేస్తోంది.