DGP: గత ఐదేళ్లలో తప్పులు జరిగినది వాస్తవమే.. ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు
గత ఐదేళ్లలో తప్పులు జరిగినది వాస్తవమేనని, ఆ తప్పులను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు(AP DGP Dwaraka Tirumala Rao) వ్యాఖ్యానించారు.
దిశ, డైనమిక్ బ్యూరో: గత ఐదేళ్లలో తప్పులు జరిగినది వాస్తవమేనని, ఆ తప్పులను ఇప్పుడు సరిదిద్దుకుంటున్నామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు(AP DGP Dwaraka Tirumala Rao) వ్యాఖ్యానించారు. పిఠాపురం(Pitapuram) పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(deputy CM Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. దీనిపై ఇవాళ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్(DSP's POP) కార్యక్రమంలో మాట్లాడుతూ.. క్లారిటీ ఇచ్చారు. గతంలో కొన్ని తప్పులు జరిగినట్లు ఒప్పుకుంటున్నామని, ప్రస్తుతం వాటిని సరిదిద్దటంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. అలాగే ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పోలీస్ వ్యవస్థ(Police Dept)లో చర్యలు చేపట్టామని, మానవ హక్కులు, పిల్లలు, మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
గత ప్రభుత్వంలో పోలీసులు సరిగ్గా విధులు నిర్వహించలేదని, ఓ పార్టీ కార్యాలయం(Party Office)పై దాడి జరిగినా కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ వల్లనే దాడి జరిగిందని రికార్డులలో రాసుకున్నారని, ఆ కేసులో ఒక్కరిని అరెస్ట్(Arrest) చేయలేదని తెలిపారు. అలాగే తప్పు జరిగితే 30 ఏళ్లకైనా చర్యలు తీసుకోవచ్చని, కేరళలో తప్పు జరిగిన 20 సంవత్సరాల తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ కు శిక్ష విధించారని గుర్తు చేశారు. న్యాయం చేసేందుకే చట్టాలు, కోర్టులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక ఐజీ సంజయ్ పై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ... దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయిస్తోందని, ఆ నివేదిక జీఏడీకి వెళ్లిన తర్వాత తమ వద్దకు వస్తుందని డీజీపీ వివరించారు.
Read More..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ డీజీపీ తిరుమలరావు