సీఎం జగన్‌తో సునీల్ కుమార్ భేటీ
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆయనకు డీజీగా ప్రమోషన్ కల్పించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ఆయనకు డీజీగా ప్రమోషన్ కల్పించింది. ఇకపై సునీల్ కుమార్ డీజీ హోదాలో కొనసాగనున్నారంటూ సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీజీగా పదోన్నతి కల్పించిన అనంతరం సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చ అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. సునీల్‌తోపాటు త్రివిక్రమ్ వర్మ, పాల్ రాజు, శ్యాంసుందర్ కేంద్ర సర్వీసులలో ఉన్న అమిత్ గార్గ్, మహేశ్ దీక్షిత్‌లకు సైతం డీజీగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. కోయ ప్రవీణ్, భాస్కర్ భూషణ్, అమ్మిరెడ్డిలకు డీఐజీగా ప్రమోషన్ లభించిన సంగతి తెలిసిందే.