మల్లన్న దర్శనానికి గంటల కొద్దీ క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులు.. ఆ పని చేస్తున్న అధికారులు
ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది.
దిశ శ్రీశైలం: ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీశైలంలో ముక్కంటి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి నెలకొంది. భక్తులు వేకువజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శన కంపార్టుమెంట్లలో బారులు తీరారు. అయితే భక్తుల రద్దీ ఎక్కువగా అనడంతో శ్రీ స్వామి సామెత అమ్మవారి దర్శించుకునేందుకు భక్తులు సుమారు 4 గంటల పాటు క్యూ లైన్ లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు, ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, మంచినీరు అందిస్తున్నారు.