తిరుమలకు పోటెత్తిన భక్తులు.. కంపార్టుమెంట్లు ఫుల్
తిరుమలకు భక్తులు పోటెత్తారు. ...
దిశ, వెబ్ డెస్క్: తిరుమలకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండకు చేరుకుంటున్నారు. రాజకీయ సినీ ప్రముఖులు సైతం శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. దీంతో దర్శన క్యూ లైన్లన్నీ నిండిపోతున్నాయి. ప్రత్యేక దర్శనం క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు. సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటలు పడుతోంది. దీంతో కంపార్టుమెంట్లన్ని నిండి శిలాతోరణం వరకూ భక్తులు వేచియున్నారు. 71,510 మంది భక్తులు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. 43,199 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. వెంకన్న హుండీ ఆదాయం రూ. 3.63 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. శని, ఆదివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లతో పాటు కంపార్టుమెంట్లలోనూ భక్తులను అన్ని సౌకర్యాలు అందజేస్తున్నారు. మంచినీరు, ప్రసాదం, పాలు వంటివి ఎప్పటికప్పుడు భక్తులకు అందజేస్తున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.