AP:ముగిసిన వారాహి దీక్ష..మరో దీక్ష చేపట్టనున్న డిప్యూటీ సీఎం?

ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం సాధించింది.

Update: 2024-07-07 08:41 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జూన్ 25వ తేదీ నుంచి 11 రోజులు చేపట్టిన అమ్మవారి వారాహి దీక్ష నిన్న (శనివారం) ముగిసిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన కేవలం ద్రవ ఆహారమైన పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మరో దీక్ష చేపట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాతుర్మాస దీక్షను పవన్ కళ్యాణ్ గత రెండు దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం చాతుర్మాస దీక్ష చేపట్టనున్నారు. దీంతో పవన్ కళ్యాణ్‌కు దైవ భక్తి ఎక్కువ అని తెలుస్తోంది.  దీక్షలో ఉండి కూడా ఉపముఖ్యమంత్రిగా విధులు చేపడుతున్న పవన్ కల్యాణ్ వివిధ సమావేశాలకు కూడా హాజరవుతున్నారు. అయితే ఈ చాతుర్మాస దీక్ష నాలుగు నెలల పాటు కొనసాగనుంది. పవన్ కల్యాణ్ నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షలో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో ఆయన ప్రతి ఏడాది ఈ దీక్ష చేపట్టి పూర్తి చేస్తారని తెలిపారు. 


Similar News