Pawan Kalyan:సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన డిప్యూటీ సీఎం పవన్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) ఈ రోజు(గురువారం) లేఖ రాశారు.

Update: 2024-09-12 13:34 GMT

దిశ,వెబ్‌డెస్క్:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) ఈ రోజు(గురువారం) లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని ఇకపై క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకుంటానని తెలిపారు. కావున విజయవాడ(Vijayawada)లో కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని, ఫర్నిచర్, ఇతర సామగ్రి సహా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన లేఖలో వివరించారు. విజయవాడలో ఎంతో విశాలమైన క్యాంపు కార్యాలయాన్ని(Camp office) తనకు కేటాయించడం పై చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక నుంచి మంగళగిరిలోని తన నివాసం నుంచే కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని(Camp office) ప్రభుత్వానికి తిరిగి అప్పగిస్తున్నానని జనసేనాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.


Similar News