జాతీయ జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

78 వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు.

Update: 2024-08-15 03:56 GMT

దిశ, వెబ్ డెస్క్: 78వ స్వాతంత్ర వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పాల్గొన్నారు. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవన్ కల్యాణ్ మొట్టమొదటి సారి డిప్యూటీ సీఎం హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వేలాది మంది అమరుల త్యాగాల ద్వార వచ్చిన ఈ స్వాతంత్ర్యం వేడుకల వేళ తాము ఆనందించాల్సిన దానికంటే.. దేశ బాధ్యతను గుర్తు చేసుకునే రోజు అని.. ఇలాంటి బాధ్యతే తనను ఈ రోజు ఈ స్థానంలో నిలబెట్టిందని గుర్తు చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు చెందిన పలువురు స్వాతంత్ర్య యోదులను డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ గుర్తు చేశారు. దీంతో పాటుగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, డొక్క సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం, ప్రభుత్వం అందిస్తున్న పలు పథకాల గురించి పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News