AP News:పెన్షన్ల పంపిణీ పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తానన్న హామీలపై ఎన్డీయే కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది.
దిశ,వెబ్‌డెస్క్:ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో కూటమి అధికారంలోకి వస్తే అమలు చేస్తానన్న హామీలపై ఎన్డీయే కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో జులై 1, ఆగస్టు 1వ తేదీన విజయవంతంగా ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పూర్తి చేశామని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న(గురువారం) రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది అని చెప్పారు. పంపిణీ దాదాపు పూర్తి కావచ్చింది. పింఛన్ల పంపిణీ విజయవంతంగా సాగడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి పాలన ప్రారంభమయ్యాక పెంచిన సామాజిక పింఛన్లు రెండో నెలలోనూ విజయవంతంగా లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పంపిణీ చేశామని అన్నారు. 64 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు రూ.2737.4 కోట్ల మొత్తాన్ని గురువారం ఉదయం నుంచి ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందించారని చెప్పారు.