400 గ్రామాలకు రూ.4 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.

Update: 2024-09-09 14:24 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో భారీ వరదలు సంభవించాయి. ఈ క్రమంలో కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఏలేరు కాలువకు భారీ గండి పడి స్థానికులు వారం రోజులుగా వరద నీటిలోనే ఉంటున్నారన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో పడవలో ప్రయాణించి నేరుగా బాధితులను కలిసి మాట్లాడారు. వరద ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని, వరద బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని తెలిపారు. అనంతరం అధికారులో చర్చించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప.గో: వరద బాధిత గ్రామాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. 400 గ్రామాలకు గాను రూ.4 కోట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా యలమంచిలి మండలం లో 10 గ్రామాలకు రూ.లక్ష చొప్పున చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం వరద ప్రాంతాల్లో మరోసారి పవన్ కల్యాణ్ కాలి నడకన వెళ్లారు.

Read More : https://x.com/JanaSenaParty/status/1833131545877430532


Similar News