దేవరాపల్లిలో గడప గడపకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు.. డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు

దేవరాపల్లిలో గడప గడపకు మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు అన్నారు.

Update: 2023-06-08 13:21 GMT

దిశ, ఉత్తరాంధ్ర: రానున్న 25 ఏళ్ళకు సరిపడే విధంగా మండలంలో నీటి సరఫరా వ్యవస్థ ఉండాలని, భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి మూలములన నీటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ మంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీలు పరిధిలో ఉన్న 96 శివారు గ్రామాలకు 219 జల్ జీవన్ మిషన్ పనులను మూడు దఫాలుగా మంజూరు చేశామని తెలిపారు. దేవరాపల్లి లోని రైవాడ అతిధి గృహంలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అయన మాట్లాడుతూ.. మూడు దశలో దేవరాపల్లి మండలానికి రూ. 51 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో 96 గ్రామాలకు గాను సరిపడా మంచినీటి ట్యాంకులు, పైపు లైన్లు, బోరుబావులు ద్వారా ఇంటింటికి కుళాయి నిర్మాణం ద్వారా సుమారు 16,570 ఇళ్లకు గాను ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిలు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా దేవరాపల్లి గ్రామపంచాయతీ పరిధిలో దేవరాపల్లి గ్రామానికి గాను రూ.4.83 కోట్లు మంజూరు చేసామని, ఆవాస గ్రామాలైన అల్లిపురం,ముత్యాలమ్మపాలెం, బంగారమ్మ పాలెం కు సుమారు రూ. 75 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో చేసిన పనుల త్వరితగతిని పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు ఇందులో ఎటువంటి అలసత్వం లేకుండా ఉండడం కొరకు ప్రతి నెల మొదటి వారంలో సమీక్ష సమావేశం విధిగా నిర్వహించి పనుల పురోగతిని పరిశీలిస్తామని తెలిపారు. గ్రామాల్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం , పైపు లైను నిర్మాణం ఏకధాటిన సాగాలని కాంట్రాక్ట్ లు అలసత్వం వహిస్తే విధులను వేరొకరికి మల్లిస్తామని తెలిపారు. వాటర్ ట్యాంకు నిర్మాణానికి స్థల సేకరణలు పూర్తి చేశామని మిగిలిన ప్రాంతాలలో సేకరణ చేపడుతున్నామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో మండల మాజీ ఎంపిపి కిలపర్తి భాస్కరరావు, డి.ఈ అల్లి సూర్యనారాయణ, ఏ.ఈ.చంద్రశేఖర్, ఎలక్ట్రికల్ ఏ.ఈ.శంకర రావు పాల్గొన్నారు.

Tags:    

Similar News