వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి: పితాని సత్యనారాయణ

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అని మాజీమంత్రి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు.

Update: 2023-12-20 12:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి అని మాజీమంత్రి పితాని సత్యనారాయణ పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లాలో జరిగిన యువగళం నవశకం బహిరంగ సభకు హాజరైన మాజీమంత్రి పితాని సత్యనారాయణ సభను ఉద్దేశించి ప్రసంగించారు. యువగళం-నవశకం రాష్ట్ర ప్రజానీకంలో నూతనోత్తేజాన్ని తెచ్చింది అని అన్నారు. పోలిపల్లి సభతో సైకో సర్కారుకు అంతిమ ఘడియలు ఆరంభమయ్యాయి అని చెప్పుకొచ్చారు. యువగళం కేవలం పాదయాత్రే కాదు...అవినీతిపరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జైత్రయాత్ర అని చెప్పుకొచ్చారు. జగన్ అరాచకపాలనతో 5కోట్ల ప్రజల ఆశలు, ఆశయాలను ఆవిరిచేశాడు అని మండిపడ్డారు. ప్రజలకు భరోసానిస్తూ ముందుకు కదిలిన దమ్మున్న నాయకుడు నారా లోకేశ్ అని పితాని సత్యనారాయణ చెప్పుకొచ్చారు. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటున్న జగన్ ఆయా వర్గాలకు ఏం చేశాడో చెప్పగలడా? అని ప్రశ్నించారు. బీసీలకు పెట్టిన కార్పొరేషన్లలో చైర్ పర్సన్లు కూర్చునేందుకు కనీసం కుర్చీలు కూడా ఇవ్వలేదు...కార్పొరేషన్లను నిర్వీర్యం చేశాడు అని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో శాండ్, లిక్కర్, ల్యాండ్, మైన్ మాఫియా పేట్రేగిపోతోంది అని మండిపడ్డారు. సెంటు పట్టాల పేరుతో పేద, బడుగుల అసైన్డ్ భూములను జగన్ దోచుకున్నాడని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన రాజకీయ రిజర్వేషన్లను అమలు చేసేందుకు టీడీపీ-జనసేన కృషి చేస్తుంది. 2024లో జరగనున్న కురుక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని ప్రజలు గెలిపించాలి అని మాజీమంత్రి పితాని సత్యనారాయణ ప్రజలు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News