AP:అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు ఇవ్వాలని డిమాండ్

ఏపీ విద్యాశాఖ ఇటీవల దసరా సెలవులు(Holidays) ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-09-21 02:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ విద్యాశాఖ ఇటీవల దసరా సెలవులు(Holidays) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అకడమిక్ క్యాలెండర్(Academic Calendar) ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో మహాలయ అమావాస్య దృష్ట్యా అక్టోబర్ 2 నుంచి దసరా సెలవులు(Dussehra holidays) ఇవ్వాలని ఆర్‌జేయూపీ(RJUP) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి కాగా 3న కూడా సెలవు ఇస్తే ధార్మిక క్రతువులకు వీలుంటుందని ఒక ప్రకటన విడుదల చేశారు. అటు ప్రభుత్వం(Government) ఇప్పటికే అక్టోబర్ 4 నుంచి దసరా సెలవులు ప్రకటించింది. ఈ క్రమంలో ఇటీవల ఏపీలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో(Heavy Rains) పలు జిల్లాల్లో 5 నుంచి 6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా సెలవులు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


Similar News