AP News:విజయసాయిరెడ్డి కూతురికి మరో బిగ్ షాక్.. ఆ నిర్మాణాలను కూల్చివేయాలని హైకోర్టు ఆదేశాలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో(High Court) మరో ఎదురుదెబ్బ తగిలింది.

Update: 2024-09-21 04:23 GMT

దిశ,వెబ్‌డెస్క్: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తెకు హైకోర్టులో(High Court) మరో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఇచ్చిన ఓ ఆదేశం అమల్లో భాగంగా తాజాగా ఆమెకు హైకోర్టు మరో షాకిచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నేహారెడ్డి విశాఖలో నిర్మించుకున్న ఓ కట్టడం అక్రమమని తేల్చిన హైకోర్టు(High Court) దాన్ని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు మరో షాకిస్తూ తాజాగా జీవీఎంసీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేహారెడ్డికి చెందిన స్థలంలోని కాంక్రీట్ నిర్మాణాలను(Concrete structures) జీవీఎంసీ అధికారులు కూల్చి వేస్తున్నారు.

హైకోర్టు ఆదేశాలతో 2 వారాల క్రితమే జీవీఎంసీ అధికారులు నిర్మాణాల తొలగింపును చేపట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా ఈ రోజు(శనివారం) మరోసారి కూల్చివేతల కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశాఖ జిల్లా భీమిలిలో సర్వే నెంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో ఈ కట్టడాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాలు ఉన్న ఈ ఆక్రమిత స్థలంలో అక్రమ కట్టడాలు(Illegal constructions) ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలపై ఇటీవల ఏపీ హైకోర్టులో(AP High Court) జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ పిల్ వేశారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. 


Similar News