ఢిల్లీ లిక్కర్ స్కామ్: మాగుంట రాఘవకు కస్టడీ పొడిగింపు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అంశంలో ఫిబ్రవరి 10న ఈడీ అదుపులోకి తీసుకున్న మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది.
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ అంశంలో ఫిబ్రవరి 10న ఈడీ అదుపులోకి తీసుకున్న మాగుంట రాఘవ జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు కోర్టు పొడిగించింది. అతడి కస్టడీ ముగియడంతో ఇవాళ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో అధికారులు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని అందువల్ల అతడి కస్టడీ పొడిగించాలని ఈడీ కోరింది. ప్రస్తుతం మాగుంట రాఘవ రెడ్డి తీహార్ జైలులో ఉన్నారు. మరోవైపు రాఘవ బెయిల్ పిటిషన్‌పై మార్చి 13న విచారణ జరపనుంది.
ఇవి కూడా చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కామ్: మనీష్ సిసోడియాకు మరోసారి షాక్