AP Elections 2024: వైసీపీలో ముదురుతున్న విబేధాలు.. కారణం ఇదే
రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అభ్యర్థుల నియామకంలో మార్పులు చేర్పులు చేసిన విషయం అందరికి తెలిసిందే.
దిశ డైనమిక్ బ్యూరో: రానున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం అభ్యర్థుల నియామకంలో మార్పులు చేర్పులు చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ మార్పులు చేర్పుల కారణంగా పార్టీలో విబేధాలు చోటు చేసుకున్నాయి. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొత్త ఇంఛార్జులపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో చోటు చేసుకుంటున్న అంతర్గత విబేధాలు బహిర్గతం అవుతున్నాయి.
ముఖ్యంగా అనంతపురం జిల్లా రాయదుర్గం వైసీపీ కలహాలకు కేర్ అఫ్ అడ్రస్ గా మారింది. రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపు రామచంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే రానున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డిని పక్కన పెట్టి ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డికి ఇంచార్జ్ గా బాధ్యతలు వైసీపీ అధిష్టానం అప్పగించింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన కాపు రామచంద్ర రెడ్డిని పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అలానే రామచంద్రారెడ్డి జగన్ ని కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్ మెంట్ దొరకలేదు. కాగా పార్టీని వీడుతున్నట్లు రాంచంద్రారెడ్డి ప్రకటించారు. కానీ పార్టీని వీడలేదు. ధీయుతో రాయదుర్గంలో వైసీపీ కాపు, మెట్టు రెండు వర్గాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ఇరువురు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.